VIDEO: హిందూపురంలో న్యాయవాదుల నిరసన
SS: హిందూపురం అంబేద్కర్ సర్కిల్లో న్యాయవాదులు బుధవారం నిరసన చేపట్టారు. హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్ అబ్దుల్ రహీంపై సీఐ అబ్దుల్ కరీమ్ దౌర్జన్యం చేశాడని బార్ అసోసియేషన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో అడ్వకేట్లు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.