నేడు జడ్పీ సర్వసభ్య సమావేశం
SKLM: జిల్లా ప్రజా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఇవాళ జరగనున్నట్లు జడ్పీ సీఈవో ఆర్. వెంకటరామన్ తెలిపారు. ఉదయం 10.30 కు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం ప్రారంభమవుతుందని తెలిపారు. జడ్పీ ఛైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నట్లు పెర్కొన్నారు.