సమయపాలన పాటించని అధికారులు.!

సమయపాలన పాటించని అధికారులు.!

KDP: చక్రాయపేట మండలంలో ఉపాధి హామీకి సంబంధించిన అధికారులు సమయపాలన పాటించడం లేదని మండలానికి చెందిన పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు అయినా విధులకు సంబంధిత సిబ్బంది హాజరు కావడంలేదని ఆరోపించారు. ప్రతిరోజు ఇదే తంతు నడుస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు విధులకు సక్రమంగా హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.