VIDEO: కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
SRCL: తంగళ్ళపల్లిలో కేటీఆర్ చిత్రపటానికి ఆటో డ్రైవర్లు శనివారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేటీఆర్ ఆటో కార్మికుల బాధను చూసి కార్మికుల కోసం ప్రమాద బీమా చేయించాడని ఆనందం వ్యక్తం చేశారు. ఆటో కార్మికుల కోసం ప్రమాద బీమా చేయించిన కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆటో కార్మికులు యోగి, సలీం, రాములు పాల్గొన్నారు.