నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాలులు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం పలు మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు ఉంటాయని APSDMA హెచ్చరించింది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని X ఖాతా ద్వారా రెడ్ అలెర్ట్ జారీ చేసింది. బూర్జ, హిరమండలం, లక్ష్మినరసంపేట్, పాతపట్నం, సారవకోట, సరుబుజ్జిలి మండలాల్లో భానుడి ప్రతాపం ఉంటుందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.