సీపీఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

సీపీఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

KMM: బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో సీపీఐ ఎంఎల్ ఆవిర్భావ దినోత్సవం, కామ్రేడ్ లెనిన్ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు నిర్వహించాయి. ఈసందర్భంగా మండల నాయకులు పీ.వెంకటేశ్వర్లు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా నాయకుడు ఎం. గిరి మాట్లాడుతూ.. సమాజంలో పీడిత ప్రజల విముక్తికి విప్లవ పోరాటమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు. లెనిన్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.