ప్రత్యేక అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రత
GNTR: ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, స్వయంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. అసెంబ్లీ ఆవరణలోకి ప్రవేశించే వారిపై కఠిన తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డులు, అనుమతులు ఉన్నవారినే అనుమతిస్తున్నారు.