రేపు ఉచిత వైద్య శిబిరం
WGL: రాయపర్తి మండల కేంద్రంలోని MPDO కార్యాలయ ఆవరణలో మార్చి 20వ తేదీన క్రీస్తు జ్యోతి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు MPDO కిషన్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, పంచాయతీ కార్మికులు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని MPDO కిషన్ నాయక్ సూచించారు.