మేడారం మహాజాతరకు రూ.150 కోట్లు విడుదల

మేడారం మహాజాతరకు రూ.150 కోట్లు విడుదల

TG: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు రూ.150 కోట్ల విడుదలకు ఆర్థికశాఖ పాలనాపరమైన అనుమతులిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి మేడారం మహాజాతర ప్రారంభమై 31న ముగియనుంది. ఈ మేరకు మంజూరైన నిధులతో భక్తులు, వీఐపీల కోసం రూ.5 కోట్లతో గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టనున్నారు.