'పట్టణంలో స్వచ్ఛమైన నీటిని సరఫరా చేస్తాం'

PPM: పట్టణంలో స్వచ్ఛమైన నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి.శ్రీనివాసరాజు తెలిపారు. ఈ నెల 9వ తేదీన ఒక దినపత్రిక నందు ప్రచురించబడిన నీటిలో నురగలు... నోటిలో పురుగులు వార్తకు ఆయన పైవిధంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే గురువారం ప్రకటన విడుదల చేశారు. వర్షాలు అధికంగా కురిసినప్పుడు నాగావళి నదిలో నీరు అధికమయ్యే సమయంలో నీరు రంగు మారుతున్నట్లు చెప్పారు.