VIDEO: మంగళగిరిలో వైభవంగా పుష్పయాగోత్సవం
GNTR: మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం పుష్పయాగోత్సవం ఘనంగా జరిగింది. వివిధ రకాల సుగంధ పుష్పాలతో స్వామివారికి పూజలు నిర్వహించారు. స్వామివారిని సేదతీర్చేందుకు ఈ ఉత్సవం జరుపుతామని ప్రధాన అర్చకులు మాల్యవంతం శ్రీనివాసదీక్షితులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఈవో కోగంటి సునీల్ కుమార్ పర్యవేక్షించారు.