వివిధ ఉద్యోగాలకు 250 మంది సెలెక్ట్

NLG: మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ప్లేస్‌మెంట్ డ్రైవ్‌ను ఉపకులపతి ఆచార్య అల్తాఫ్ హుస్సేన్ ప్రారంభించారు. సెమినార్ హాల్, ఆర్ట్స్ బ్లాక్ వేదికగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 250 మంది ఎంపిక అయినట్లు ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ డా. వై ప్రశాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్‌మెంట్ డైరెక్టర్ సందీప్, హిమబిందు, చందర్ పాల్గొన్నారు.