అడవికి నిప్పు.. ముగ్గురు నిందితులకు రిమాండ్

అడవికి నిప్పు.. ముగ్గురు నిందితులకు రిమాండ్

NGKL: అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో నిప్పు పెట్టిన కేసులో ముగ్గురు నిందితులను సోమవారం అటవీ అధికారులు అరెస్ట్ చేసి, 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై DFO రేవంత్ చంద్ర స్పందిస్తూ.. అటవీ సంపదకు, వన్యప్రాణులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ సంరక్షణలో ఎవరూ అలసత్వం వహించకూడదని సూచించారు.