కొత్తకొండ జాతరకు బస్సులను ప్రారంభించిన డీఎం

కొత్తకొండ జాతరకు బస్సులను ప్రారంభించిన డీఎం

KNR: కొత్తకొండ జాతరకు వెళ్లే భక్తుల కోసం హుజూరాబాద్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులను డిపో మేనేజర్ రవీంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ ప్రత్యేక బస్సులో పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30గా ఛార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. వీటిలో మహాలక్ష్మి పథకం కూడా వర్తిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.