సీఎంపై ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు
ADB: జిల్లా పర్యటనలో భాగంగా గురువారం CM రేవంత్ రెడ్డి ఆదిలాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నన్ను బీజేపీ ఎమ్మెల్యే అని చూడకుండా నా నియోజకవర్గానికి రూ. 400 కోట్లు నిధులు ఇచ్చారు. రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూలు ఇచ్చారు. ఇంత చేసిన సీఎం వస్తే నేనేందుకు ఆత్రుత పడకూడదు' అని వెల్లడించారు.