కేబుల్ వైర్ల తొలగింపు పై ఆగ్రహం

NLG: తమ ఉపాధిని దెబ్బతీసేలా కేబుల్ వైర్లను తొలగిస్తున్నారని కొండమల్లేపల్లి కేబుల్ ఆపరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా 'ఛలో హైదరాబాద్' కార్యక్రమానికి ఆదివారం బయలుదేరారు. 'స్టాప్ కేబుల్ కటింగ్ వైర్స్, సేవ్ ఫైవ్ నెట్' అనే నినాదాలతో ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనలో హనుమంతుతో సహా పలువురు కేబుల్ ఆపరేటర్లు పాల్గొన్నారు.