సీఎం సహాయనిది చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

BDK : దమ్మపేట మండలంలో ఎమ్మెల్యే ఆదినారాయణ ఆదివారం పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా నాచారం, తొట్టిపంపు, తాటి మల్లమ్మ గుంపు, జమేదార్ బంజర గ్రామాల లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు అందజేశారు. అనంతరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించి, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు.