VIDEO: బాల కార్మికుడి గుర్తింపు – గ్రానైట్ కంపెనీ యజమానిపై కేసు
MLG: ఎల్కతుర్తి మండల కేంద్రంలో బాల కార్మికుడితో ప్రమాదకర పనులు చేయిస్తున్న సాయి గణపతి గ్రానైట్ కటింగ్ కంపెనీ యజమానిపై మంగళవారం కేసు నమోదు. ‘ఆపరేషన్ స్మైల్’ బృందం పరిశీలనలో బాలుడిని గుర్తించి హనుమకొండ బాలల సంక్షేమ సమితికి తరలించి, అనంతరం అతని సోదరుడికి అప్పగించారు. పోలీసులు కంపెనీ యజమాని కాశీరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.