కోడుమూరులో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

KRNL: కోడుమూరు పట్టణంలో గురువారం మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. స్థానిక జనార్దన్ శెట్టి అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. ఈ సందర్భంగా హాజరైన సీఐ తబ్రెజ్ మాట్లాడుతూ.. పర్యావరణహితం కోసం జనార్దన్ శెట్టి చేస్తున్న కృషిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.