బాంబు పేలుడు నేపథ్యంలో తనిఖీలు
VZM: ఢిల్లీ బాంబు పేలుడు నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో విజయనగరం రైల్వే స్టేషన్‌లో ఉన్న అన్ని ప్లాట్ పారాలు నిశితంగా జీఆర్పీ, రైల్వే రక్షక దళం సంయుక్తంగా బుధవారం తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా ఉన్న ప్రయాణికుల బ్యాగులను మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేసి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో సిబ్బంది పాల్గొన్నారు.