వంతెన పునర్నిర్మాణంపై గ్రామస్థుల విన్నపం

కోనసీమ: కపిలేశ్వరపురం మండల పరిధిలో గోదావరిని ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలకు బొడిపాలెం వంతెనే రాకపోకలకు ఏకైక మార్గం. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ వంతెన ప్రస్తుతం తీవ్ర శిథిలావస్థలో ఉంది.ప్రభుత్వాలు మారినా సమస్య పరిష్కారం కాలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బండారును కలిసి, నూతన వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు.