కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ వెంకటరాములతో పాటు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే ఆల సమక్షంలో BRSలో చేరారు. ఆయన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.