'మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తక్షణమే తెరవాలి'
ELR: రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దెందులూరులో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకుపైగా మొక్క జొన్నను పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారని చెప్పారు.