గంజాయితో ముగ్గురు అరెస్ట్

గంజాయితో ముగ్గురు అరెస్ట్

VSP: గాజువాక జింక్ గేట్ వద్ద గంజాయితో ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ పార్థసారథి తెలిపారు. వారి వద్ద నుంచి 4 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకుని రెండు బైకులు సీజ్ చేశారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో దువ్వాడకు చెందిన తిలపాక నాని, గాజువాక డిపోకు చెందిన జడ్డా రాజేష్, ములగాడకు చెందిన గుజరాపు నితీశ్ ఉన్నారు. వీరిలో ఇద్దరిపై రౌడీ షీట్ ఉంది.