గంజాయి నిర్మూలన కోసం సెల్ఫీ ఫ్లెక్సీ ఏర్పాటు
NZB: గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పిస్తూ నిజామాబాద్ రూరల్ పోలీసులు సెల్ఫీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో పలువురు ఫ్లెక్సీ వద్ద ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ 'నో డ్రగ్స్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. రూరల్ SHO శ్రీనివాస్ మాట్లాడుతూ.. యువత తమ విలువైన భవిష్యత్‌ను ,ఆరోగ్యాన్ని పాడుచేసుకోకుండా అవగాహన కల్పించడమే సెల్ఫీ ఫ్లెక్సీ ప్రధాన ఉద్దేశ్యమన్నారు.