బడంగ్‌పేట్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి
RR: బడంగ్‌పేట్‌లో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఎదుట ఇవాళ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికుల వివరాల మేరకు.. రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లుగా అంచనా వేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.