కదిరిలో ఆరుగురిపై బైండోవర్: సీఐ

కదిరిలో ఆరుగురిపై  బైండోవర్: సీఐ

సత్యసాయి: కదిరిలో గొడవకు దిగిన ఆరుగురిని పోలీసులు బైండోవర్ చేశారు. మక్బూల్ బాషా, మైనుద్దీన్, ముక్తియార్, అల్హాప్, ఇమ్రాన్, ఇంతియాజ్‌లను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. నిందితులను తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టారు. బహిరంగ ప్రదేశంలో ఘర్షణ పడి శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.