శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనం
అన్నమయ్య: పుల్లంపేట మండలం ఆర్.వడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పాడైన గోడలు, చెదిరిన భవనం, పరిసరాల్లో పెరిగిన పొదలు విద్యార్థులకు ప్రమాదకరంగా మారాయి. వర్షం పడితే భవనం కూలిపోతుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన సదుపాయాలు లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. పాఠశాలకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.