'మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రణాళికలు'

'మంగినపూడి బీచ్ అభివృద్ధికి ప్రణాళికలు'

కృష్ణా: స్వదేశీ దర్శన్ కింద మచిలీపట్నం మంగినపూడి బీచ్‌ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్‌తో కలిసి గురువారం రాత్రి మంగినపూడి బీచ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీచ్ అభివృద్ధికి రూ.150కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశామని అన్నారు.