VIDEO: సమ్మక్క–సారలమ్మలను దర్శించిన మంత్రులు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క–సారలమ్మలను శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మునుగోడు ఎమ్మెల్సీ నీలాకంటి సత్యం, స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు.