అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయింపు
KRNL: ఆదోని మండలం కపటి గ్రామంలో ఇవాళ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం కేటాయించారు. ఎమ్మెల్యే డా. పార్థసారధి ఇరువర్గాలను సమన్వయం చేసి సమస్యను పరిష్కరించారు. స్థానిక దాతలు ముందుకు వచ్చి విగ్రహం కోసం భూమి ఇవ్వడం జరిగింది. త్వరలో విగ్రహావిష్కరణను భారీగా నిర్వహిస్తామని యువజన సంఘం తెలిపింది.