విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ పై అవగాహన

అన్నమయ్య: జిల్లా అదనపు ఎస్పీ ఎం. ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో సోమవారం రాజంపేటలోని పలు పాఠశాలల్లో శక్తి టీం బృందాలు విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్‌పై, పోక్సో చట్టాలు, డయల్ 112, శక్తి యాప్ సేవలపై అవగాహన కల్పించాయి. స్వీయ రక్షణ పద్ధతులు, ఈవ్ టీజింగ్, ప్రేమ పేరుతో మోసాలు, మహిళలపై నేరాలు, చట్టాలపై చర్చించి, సమస్యలు ఎదురైతే 112 కు ఫిర్యాదు చేయాలన్నారు.