'పునర్విభజనలో ఒక స్థానాన్ని ఎస్సీకి కేటాయించాలి'
ఆసిఫాబాద్ జిల్లాలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఒక స్థానాన్ని SC కి కేటాయించాలని దళిత నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న 2 నియోజకవర్గాలను 3గా విభజించి, కొత్తదాన్ని SC రిజర్వ్ ప్రకటించాలని కోరారు. SC జనాభా అధికంగా ఉన్నందున తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.