తండ్రి గొంతు కోసి చంపిన తనయుడు
AP: కన్న తండ్రిని గొంతు కోసి హత్య చేసిన ఘటన తూ.గో జిల్లా తొర్రేడులో జరిగింది. అప్పారావు(49) అనే వ్యక్తి తన చిన్న కుమార్తెకు పెళ్లి సంబంధం రాగా.. రూ.2 లక్షలు కట్నంగా అడగగా.. ఇవ్వలేనని వెనకడుగు వేశాడు. ఈ విషమయై కుమారుడు సాయికుమార్ తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంతో చాకుతో తండ్రి గొంతుకోసి చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.