శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్న డైరెక్టర్ డీజీపీ

HNK: ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం డైరెక్టర్ డీజీపీ అభిలాష్ బిస్త్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, మధుకర్ శర్మ, నరేష్, శ్రీనివాసు, పూజారులు , ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికి అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి పూజారులు వివరించారు.