రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
PLD: నకరికల్లు సమీపంలో ఆదివారం రాత్రి పెట్రోల్ బంకు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లగుండ్ల గ్రామానికి చెందిన పాలపాటి వీరాంజనేయులు (38) మృతి చెందాడు. లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వీరాంజనేయులు మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.