కల్తీ పాలు.. ఆగని మరణాలు

కల్తీ పాలు.. ఆగని మరణాలు

E.G: రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల ఘటనలో రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి జయకృష్ణ 23 రోజులుగా మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. చిన్నారికి నయమవుతుందని తల్లిదండ్రులు ఎంతో ఆశగా ఎదురు చూడగా.. మృతి చెందడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. కాగా.. ఘటనకు సంబంధించి మరికొందరు చికిత్స పొందుతున్నారు.