ఉపాధి పనులపై సామాజిక తనిఖీ సమావేశం...

ఉపాధి పనులపై సామాజిక తనిఖీ సమావేశం...

VZM: గజపతి నగరం మండలంలో పాతబాగ్గాం గ్రామ సచివాలయంలో మంగళవారం ఉపాధి హామీ పనులపై సామాజిక తనిఖీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రెటరీ తిరుపతి మాట్లాడుతూ...వారం రోజుల పాటు కూలీలు చేసిన పనులను పరిశీలించి, వాటిని గ్రామ సభలో చదివి వివరించారు. గ్రామంలో 536 జాబ్ కార్డులు ఉండగా పనిచేసిన జాబ్ కార్డులు 480 ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ పాల్గొన్నారు.