జిల్లాలో బార్ల దరఖాస్తులకు ఆహ్వానం

జిల్లాలో బార్ల దరఖాస్తులకు ఆహ్వానం

PPM: పార్వతిపురం మన్యం జిల్లాలోని బార్ల దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు జిల్లా అబ్కారీ శాఖ సూపరింటెండెంట్ బి. శ్రీ నాథుడు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నూతన బార్ పాలసీని ప్రకటించిందని చెప్పారు. ఈ మేరకు మన్యం జిల్లాలో 8 బార్లకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు కలెక్టరేట్‌ను సందర్శించాలన్నారు.