బాక్సింగ్‌లో మెరిసిన కేజీబీవీ విద్యార్థులు
NRML: ఎన్‌టీఆర్ మినీ స్టేడియంలో గురువారం జరిగిన SGF జోనల్ అండర్-17 బాక్సింగ్ పోటీల్లో దిలావర్పూర్ KGBV విద్యార్థినులు మెరిశారు. ఇంటర్ 1వ సంవత్సరం విద్యార్థిని U.పల్లవి బంగారు పతకం, 10వ తరగతి విద్యార్థిని G.అక్షయ వెండి పతకం సాధించారు. రాష్ట్ర స్థాయి పోటీలు అక్టోబర్ 10 నుండి హనుమకొండలో జరగనున్నాయి.