VIDEO: బోగోలులో కార్తీక వనభోజనాలు కార్యక్రమం
NLR: బోగోలు మండలం ముంగమూరు వనమిత్ర ప్రాంగణంలో ఆదివారం కార్తీకమాసం సందర్భంగా వనభోజనాలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి విచ్చేశారు. చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. పెద్దలు, మహిళలు, చిన్నారులు మహోత్సవానికి హాజరయ్యారు.