దేశంలో పెట్రోల్, ఎల్పీజీ కొరత లేదు: కేంద్రం
దేశంలో పెట్రోల్, LPG కొరత లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఇంకా 2 నెలలకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. అన్ని పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉందని చెప్పింది. కొరత పేరిట జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది. కొన్ని LPG నౌకలు వివిధ దేశాల నుంచి వస్తుండటంతో సరఫరా సులభం కానుందని తెలిపింది. అపోహలు నమ్మొద్దని కేంద్రం సూచించింది.