మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి

NLG: చండూరు మండలం కస్తాలకు చెందిన 14 ఏళ్ల బాలిక జ్యోతి జువైనల్ డయాబెటిస్‌తో బాధపడుతోంది. ఈ విషయం తెలుసుకున్న మునుగోడు MLA కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పూర్తి చికిత్స బాధ్యతను తాను తీసుకుంటానని ఆదివారం హామీ ఇచ్చారు. ప్రస్తుతం జ్యోతికి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు.