సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధం

సరస్వతీ పుష్కరాలకు సర్వం సిద్ధం

TG: రేపటి నుంచి సరస్వతీ పుష్కరాలు మొదలు కానున్నాయి. ఈ పుష్కరాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జ్ఞాన సరస్వతీ ఘాట్ వద్ద VIPలకు, సాధారణ భక్తుల కోసం మరో ఘాట్ వద్ద పుణ్యస్నానాలకు సిద్ధం చేశారు. మరోవైపు పుష్కరాలు జరిగే రోజుల్లో ఇసుక లారీలను నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.