విద్యార్థి శ్రీ వర్షిత ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం
KNR: హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీ వర్షిత అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, BJP జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. వంగర గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న శ్రీ వర్షిత కుటుంబాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి బుధవారం రోజున స్థానిక BJP శ్రేణులతో కలిసి పరామర్శించారు.