పేకాట స్థావరంపై దాడి.. ఏడుగురు అరెస్ట్
KDP: పోరుమామిళ్ల పట్టణం సుందరయ్య కాలనీలోని కంప చెట్ల వద్ద జూదం ఆడుతున్నట్లు తనకు సమాచారం రావడంతో దాడులు చేశానని ఎస్సై కొండారెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఏడుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. వారి నుంచి రూ. 7200 నగదు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.