రోడ్డు ప్రమాదంలో చిన్నారి మృతి

కృష్ణా: పామర్రు మండలం కొండాయపాలెం వద్ద ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న దంపతులు దుర్గారావు, హారికకు తీవ్ర గాయాలయ్యాయి. సంవత్సరం పాప హన్విక పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.