ఉప్పలపాడులో లోపించిన పర్యవేక్షణ

ఉప్పలపాడులో లోపించిన పర్యవేక్షణ

PLD: నూజండ్ల మండలం ఉప్పలపాడు గురుకులంలో పర్యవేక్షణ లోపించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం కుక్క తాగిన మజ్జిగను విద్యార్థినులకు ఇచ్చారనే ఆరోపణలు వస్తున్నాయి. 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన ప్రిన్సిపాల్.. సాయంత్రం 6 కాగానే గుంటూరు వెళ్లిపోతున్నారని, తుఫాను సమయంలోనూ నీటి కోసం విద్యార్థులను గాలికొదిలేశారని తల్లిదండ్రులు మండిపడుతున్నారు.