ఆటో డ్రైవర్లతో పోలీసులు సమావేశం

ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న ఆటో డ్రైవర్లతో మంగళవారం పోలీసులు సమావేశం నిర్వహించారు. సర్కిల్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి డీఎస్పీ రవిచంద్ర, సీఐ సుభాష్, ట్రాఫిక్ ఎస్సై కుటుంబరావులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరు లైసెన్స్ కలిగి ఉండాలని, లైసెన్స్ కలిగి ఉండడం వలన కలిగే ఉపయోగాలను వివరించారు.