రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు.. చర్యలేవి..!?

రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు.. చర్యలేవి..!?

మేడ్చల్: నిజాంపేట పరిధి బాచుపల్లి ప్రాంతంలో సర్వేనెంబర్ 186 ప్రాంతంలో రాత్రికి రాత్రి అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని, అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. దీని వెనుక పెద్ద పెద్ద వ్యాపారులు, నేతలు ఉన్నట్లు చెప్పుకొస్తున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.